ప్రజాశక్తి - కురుపాం : రహదారి సౌకర్యం లేక ఎన్నో ఏళ్లగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కిచ్చాడ గ్రామ పంచాయితీ ప్రజలు దశాబ్దాలు కల నెరవేరిందని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. మండలంలోని కిచ్చాడ పంచాయతీ జోగిరాజు పేట నుండి వెంకటాపురం వరకు రూ.కోటీ 42లక్షలతో 2 కిలోమీటర్ల 800 మీటర్లు బిటి రహదారి పూర్తయిన నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజుతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించాయని, కానీ కనీసం రహదారి సౌకర్యం కల్పించలేకపోయావని, దీంతో ఈ గ్రామపంచాయతీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొండేవారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గవర రాజ్యలక్ష్మి, ఎంపిపి శెట్టి పద్మావతి, జడ్పిటిసి జి.సుజాత, అయ్యరకల కార్పొరేషన్ డైరెక్టర్ గవర విజయచంద్రశేఖర్, వైసిపి గ్రీవెన్స్ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, కళింగ వైశ్య కార్పొరేషన్ కె. సురేష్ కుమార్, ఎంపిటిసి వి.బంగారనాయుడు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










