Sep 08,2023 19:32

వివరాలు వెల్లడిస్తున్న నిర్వాహకులు

ప్రజాశక్తి - ఆదోని
ఆదోనిలో కాపు తెగ బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కరణం రంగస్వామి, చందం మల్లికార్జున తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. బీపీ, షుగర్‌, ఈసీజీ, 2డి ఈసీఓ పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి నంద్యాలలోని ఆస్పత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తారని చెప్పారు. 9963901595, 7013474059 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.