Nov 19,2021 01:02

న్యూఢిల్లీ : 600 ఏళ్ల తరువాత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. ఈ ఏడాది చంద్ర గ్రహణాల్లో ఇది చివరిది. శుక్రవారం ఉదయం 11.32 గంటలకుప్రారంభం కానును చంద్రగ్రహణం ఆరు గంటల పాటు కొనసాగనుంది. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా దీనిని దర్శించవచ్చు. అయిత మన దేశంలో అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం పరిసర ప్రాంతాల్లో మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో కొంచెం సేపు మాత్రమే కనిపించనుంది. పూర్తి గ్రహణం మధ్యాహుం 2.32 గంటలకు ఏర్పడి, సాయంత్రం 5.30 గంటలకు గ్రహణం ముగియనుంది. ఆరు గంటల పాటు కొనసాగిన ఇలాంటి సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం గతంలో 1440ల్లో ఏర్పడింది. మళ్లీ 2489 అక్టోబర్‌ 9న ఏర్పడనుంది.