Oct 12,2023 21:43

  ఏలూరు టౌన్‌ : ఏలూరు టౌన్‌ ఆటో మొబైల్‌ మెకానిక్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఈనెల 13వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆటోనగర్‌లో జరుగుతాయని ఏలూరు ఎన్నికల కమిటీ అధికారి మల్లవరపు రంగారావు తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క సభ్యుడు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును రహస్య బ్యాలెట్‌ ద్వారా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్నికల సహాయ సిబ్బంది ఉప్పులూరి హేమ శంకర్‌, శాయన అభిలాష్‌ కుమార్‌ పాల్గొన్నారు.