Sep 10,2023 20:01

ఆర్థికసాయం అందజేస్తున్న తిక్కారెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
నియోజకవర్గంలోని టిడిపి నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి భరోసా ఇచ్చారు. స్థానిక టిడిపి దళిత నాయకులు మడ్రి పౌలు అనారోగ్యంతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. ఆదివారం టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్‌ స్వామితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఉండగా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించిన ఆయన మళ్లీ రూ.20 వేల నగదును పన్నగ వెంకటేష్‌ స్వామి చేతుల మీదుగా అందజేశారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎంపిటిసి వెంకటేష్‌, టిడిపి నాయకులు హండే హనుమంతు, వట్టేప్ప గారి నరసింహ, ఏబు, పేతూరు సుధాకర్‌, శివ, శ్యామ్సన్‌ ఉన్నారు.