Sep 25,2023 21:25

ధర్నా చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌ : 14 గ్రామాలతో కూడిన నార్లవలస పంచాయతీని రెండు భాగాలుగా విడదీయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన సోమవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి వంతల సుందరరావు మాట్లాడుతూ నార్లవలస పంచాయతీ మండలంలో చాలా పెద్ద విస్తీర్ణంలో ఉందన్నారు. జిల్లేడువలస, మూలవలస, పెద్దవలస, భరిణికివలస, బొర్రా పనుకు, సీతన్నదొరవలస, దబ్బసదును గ్రామాల నుండి పంచాయతీ కార్యాలయానికి వెళ్ళాలంటే సుమారు పది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. రవాణా సౌకర్యం కూడా లేదని చెప్పారు. పెద్దవలస కేంద్రంగా ఆ గ్రామంలో మరో పంచాయతీని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కూనేటి చినబాబు, కంచూరి రాజబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, నాయకులు తాడంగి కాశీ పాల్గొన్నారు.