Aug 12,2023 20:14

ర్యాలీ ప్రదర్శనలో 150 మీటర్ల త్రివర్ణ జెండా

ప్రజాశక్తి - ఆస్పరి
నారాయణ ప్రైమ్‌ స్కూల్‌లో 'హర్‌ ఘర్‌ తిరంగ' వేడుకలు నారాయణ ప్రైమ్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ నరేష్‌ ఆచారి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆస్పరిలోని నారాయణ ప్రైమ్‌ స్కూల్‌ విద్యార్థులు 150 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో అంబేద్కర్‌ సర్కిల్‌ మీదుగా వెళ్లి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పురవీధుల గుండా ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఆధ్వర్యంలో తిరంగను ఇంటికి తీసుకురావడానికి 150 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఉపాధ్యాయులు దీప్తి, సతీష్‌ కుమార్‌, ఈశ్వర్‌, అంజి, బాలు, గాయత్రి, రేష్మ, అంజినమ్మ, శ్రీదేవి, పద్మావతి, గంగమ్మ, సంజన్న పాల్గొన్నారు.