కొత్తచెరువు : నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కొత్తచెరువులోని నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయక కార్యదర్శి పవన్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం నారాయణ పాఠశాల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా అడ్మిషన్లు నిర్వహించి అధిక ఫీజులు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏడవ తరగతి వరకే ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా పదవ తరగతి వరకు అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని అన్నారు ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు 25వేల నుండి 35 వేల వరకు విద్యార్థులతో ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. అక్కడే పుస్తకాలు యూనిఫామ్ దుస్తులకు అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. ఇరుకు గదులలో పాఠశాలను నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులు ఆడుకోవడానికి కనీసం క్రీడా మైదానం కూడా లేదన్నారు. కండిషన్ లేని బస్సులతో విద్యార్థులను తరలిస్తున్నారని విమర్శించారు. అధికారులు స్పందించి విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నవీన్, మహేంద్ర, భరత్, చంద్ర, మురళి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.










