Jun 22,2023 21:41

నారాయణ పాఠశాలను సీజ్‌ చేస్తున్న అధికారులు

ప్రజాశక్తి - కొత్తచెరువు : నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న కొత్త చెరువులోని నారాయణ పాఠశాలను ఎంఇఒ వెంకటరమణనాయక్‌ గురువారం సీజ్‌ చేశారు. డిఇఒ ఆదేశాల మేరకు ఎంఇఒ పాఠశాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. గుర్తింపు లేనందున ఆ పాఠశాలను సీజ్‌ చేశారు. ఆపాఠశాలలో పదవ తరగతి వరకు అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయలు ఫీజులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలడంతో పాఠశాలను సీజ్‌ చేశారు. ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చేంతవరకు తరగతులు నిర్వహించకూడదని దేశాలు జారీ చేశారు. పాఠశాలను సీజ్‌ చేసిన కాపీని ప్రిన్సిపల్‌ గురు ప్రసాద్‌ కు ఎంఇఒ అందజేశారు.