నారా భువనేశ్వరి కి సాధర వీడ్కోలు
నారా భువనేశ్వరి కి సాధర వీడ్కోలు
ప్రజాశక్తి- రేణిగుంట : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కి శుక్రవారం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధర వీడ్కోలు లభించింది. ఉమ్మడి జిల్లాల్లో జరిగిన నిజం గెలవాలి కార్యక్రమం శ్రీకాళహస్తిలో ముగియడంతో నారా భువనేశ్వరి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ టిఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ నాయకులు రవి నాయుడు, టిడిపి నాయకులు నారా భువనేశ్వరి కి సాదరంగా వీడ్కోలు పలికారు. అనంతరం విమానంలో నారా భువనేశ్వరి రాజమండ్రి కి బయలుదేరి వెళ్లారు.










