May 31,2023 22:35

విత్తనాల నాణ్యతను పరిశీలిస్తున్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ : రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడంలో ప్రభుత్వం వైపల్యం చెందిందని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం నాయకులు విమర్శించారు. పెనుకొండలోని వ్యవసాయ గోదాములో నిల్వ ఉన్న వేరుశెనగ విత్తనాలను ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం ఆధ్వర్యంలో నాయకులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు హరి మాట్లాడుతూ రైతులనుంచి సేకరించిన విత్తనాలను శుద్ధి చేయకుండా అలాగే పంపిణీ చేయడం వలన బస్తాలలో చెత్త చెదారం పెరుకు పోయిందన్నారు. నాణ్యమైన విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, వ్యకాసం జిల్లా కమిటి సభ్యులు గంగాధర్‌, తిప్పన్న, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.