నాణ్యమైన విద్యుత్‌ను అందించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : డివిజన్ పరిధిలోని నాణ్యవంతమైన విద్యుత్‌ను అందించాలని ఎపిఎస్‌పిడిసిఎల్ డైరెక్టర్, టెక్నికల్ ఎన్.వి.ఎస్.సుబ్బరాజు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని నెల్లూరుపాలెం 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ సరఫరా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆత్మకూరు డివిజన్ పరిధిలోని డివిజన్‌స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డివిజన్‌లోని నాణ్యమైన అంతరాయం లేని సరఫరా చేయాలని ట్రాన్స్‌ఫార్మర్లను కాలిపోకుండా చూసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు బి.జనార్ధన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సురేష్, డివిజన్ పరిధిలోని ఏఈలు పాల్గొన్నారు.










