May 23,2023 22:13

వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు

          ధర్మవరం టౌన్‌ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు వైద్యసిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నాడు మండల పరిధిలోని దర్శనమల పిహెచ్‌సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు నిరీక్షించు గది, రక్త పరీక్ష కేంద్రం, లేబర్‌, మందు నిల్వ గదులను కలెక్టర్‌ పరిశీలించారు. ప్రతిరోజు ఓపీ ఎంతవరకు వస్తుంది.? పిహెచ్‌సిలో చేసే వైద్య సేవలు ఏమిటి అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో మెడికల్‌ ఆఫీసర్‌ పుష్పలత ప్రతిరోజు 60-80 వరకు రోగులు వస్తున్నారని, జబ్బుకు తగ్గ మందులు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. రోగుల ద్వారా ఎటువంటి ఫిర్యాదులు అందకుండా చక్కటి వైద్యాన్ని అందించే బాధ్యత వైద్యులు, సిబ్బందిదే అని తెలిపారు. రక్త పరీక్షలు కూడా సక్రమంగా, నాణ్యతగా చేయాలని సూచించారు. రోగ నివారణలో అందరూ మంచి వైద్యాన్ని అందించినప్పుడే పిహెచ్‌సి మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
దర్శనమల రైతు భరోసా కేంద్రం తనిఖీ
దర్శనమల గ్రామ రైతు భరోసా కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు భరోసా కేంద్రానికి 100 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయడంతో పంపిణీకి సిద్ధంగా ఉన్న వేరుశనగ విత్తనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విత్తనం నాణ్యతగా ఉందా లేదా అని రైతులను జిల్లా కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. విత్తన నాణ్యత పై రైతులు సంతప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తిప్పేనాయక్‌, డిఎంఅండ్‌హెచ్‌ఒ కష్ణారెడ్డి, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఒ సెల్వియా సాల్మన్‌, జిల్లా వ్యవసాయ అధికారి వై వి సుబ్బారావు, మెడికల్‌ ఆఫీసర్‌ పుష్పలత, తహశీల్దార్‌ యేగేశ్వరిదేవి, ధర్మవరం డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు కష్ణయ్య, ఏపీ సీడ్స్‌ మేనేజర్‌ ధనలక్ష్మి, వ్యవసాయ అధికారి చెన్నవీరస్వామి, ఎంపీడీవో మమతాదేవి, పిహెచ్‌సి సూపర్‌వైజర్లు జయకుమారి, కామేశ్వరి పాల్గొన్నారు.