Sep 29,2023 14:36

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి వెళ్ళవలసి ఉంటుందని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిరవదిక సమ్మెలో వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు నాగభూషణం, ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సమస్యలపై జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కార్మికులు అందరితో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏటీఎం నాగరాజు అధ్యక్ష వహిoచారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు హాజరై మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఆప్కాస్ అనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దూరం చేయడం, 60 సంవత్సరాలు నిండిన సాకుతో నిర్ధాక్షణంగా తొలగించడం జరిగింది. సమావేశంలో ప్రధానంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు  చర్చించుకోవడమైనది. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో ఎంఎస్ 7 ప్రకారం స్కిల్డ్, సెమి స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని, జగనన్న ఇచ్చిన హామీలు సమాన పనికి సమాన వేతనం, పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి వెళ్ళవలసి ఉంటుందని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిరవదిక సమ్మెలో వెళ్ళడానికి కూడా వెనకాడబోమని తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీ ఎంపిక జరిగింది. 

  • ఇంజనీరింగ్ కార్మికుల నూతన జిల్లా కమిటీ ఏర్పాటు  

మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నూతన కమిటీ జిల్లా అధ్యక్షులుగా సి.మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి సంజీవ రాయుడు, కోశాధికారి రామాంజనేయులు, ఉపాధ్యక్షులు మురళి, ధనలక్ష్మి, ఓబుళపతి సహాయ కార్యదర్శులుగా రాజా, కాంతమ్మ పోతులయ్య, మొత్తం 32 మందితో నూతన కమిటీ ఎంపిక చేయడం జరిగింది.