Apr 29,2023 15:49
  • మాస్టర్ ప్లాన్ తో కుట్ర బహిర్గతం : టిడిపి కార్పొరేటర్లు 

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ముడా మాస్టర్ ప్లాన్ కాదు మచిలీపట్నం భూములు వైసీపీ కబంధహస్తాల్లోకి తీసుకునేకు వేసిన మాస్టర్ ప్లాన్ అని తేటతెల్లమవుతుందని టిడిపి కార్పొరేటర్లు ఎద్దేవా చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు మాట్లాడుతూ మచిలీపట్నం మూడ మాస్టర్ ప్లాన్ రూపకల్పన పూర్తిగా మచిలీపట్నం అభివృద్ధి నిరోధక ఎత్తుగడగా కనిపిస్తుంది తప్ప ఇందులో ఎక్కడ అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు చేయలేదని విమర్శించారు.  మచిలీపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధి పేరుతో రాబోవు 30 సంవత్సరాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించిన వైసీపీ ప్రభుత్వం దోపిడీ ప్లాన్ అని ఇట్టే  తెలిసిపోతుందని విమర్సించారు. కనీస పరిజ్ఞానం ఉన్న ఏ చదువుకున్న వ్యక్తి అయినా ఈ మాస్టర్ ప్లాన్ ని చూస్తే ఇది అభివృద్ధి ప్లాన లేక దోపిడీ ప్లాన్ అని ఇట్టే తెలిసిపోతుందన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాల్సిన మాస్టర్ ప్లాన్ వైసీపీ నేతల ప్రాపకం కోసం రూపొందించిన ప్లాన్ల కనిపిస్తుందన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుందన్నారు . అలాగే వ్యతిరేకిస్తుందన్నారు. దీనిపై ప్రజాస్వామ్యవాదులంతా స్పందించి బందరు భవిష్యత్తును కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.  ఇలాంటి ప్లాన్ అప్రూవల్ అయితే మన పిల్లల భవిష్యత్తు చీకటిమయం అవుతుందని భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం పరిశ్రమలు రావడానికి అవకాశం లేకుండా ఈ ప్లాన్ ని రూపొందించారన్నారు.  కావున బందర్ ప్రజలు వైసిపి నేతల కుట్రను గ్రహించి ముడా ప్లాన్ తిరస్కరించి బందరు భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాళ్ల కొట్టు రాము, దేవరపల్లి అనిత, అన్నం ఆనంద్, దిద్దకుంట సుధాకర్లు పాల్గొన్నారు