Sep 22,2023 16:12

ప్రజాశక్తి-నార్పల: మండల కేంద్రం అయిన నార్పలలో శుక్రవారం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో  ఎస్సీ వర్గీకరణ చట్టబద్రత సాధన కోసం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులు దీక్షలతో మన ఆవేదన తెలియజేసిన  రిజర్వేషన్ దోపిడీదారులకు కొమ్ముకాస్తున్న బిజెపి ప్రత్యేక పార్లమెంటు సమావేశంలో బిల్లు తీసుకురాలేకపోతే కేంద్రం మీద యుద్ధమేనని మాదిగలను నమ్మించి మోసం చేయాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వం ఆటలు ఇక సాగవున ప్రారంభం కాబోతున్న సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పెట్టాలని  నార్పల మండలం ఎమ్మార్పీఎస్,, ఎం ఎస్ పి డిమాండ్ చేశారు అనంతరం తాసిల్దార్ హరికుమార్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సింగనమల నియోజకవర్గం ఇంచార్జ్ రంగాపురం పుల్లప్ప సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న ఆంజనేయులు వెంకటాపురం చంద్ర నాయకులు సీనియర్ నాయకులు హనుమంతు పెద్ద గంగయ్య నార్పల మండలం అధ్యక్షులు ఎస్ వి రమణ, నార్పల మండల ఉపాధ్యక్షులు మేకల రాజు, ఎమ్మార్పీఎస్ సూర్యనారాయణ ఎమ్మార్పీఎస్ ఆ దెబ్బ బయన్న, ఎమ్మార్పీఎస్ రామాంజనేయులు అంబేద్కర్ కాలనీ అనిల్ రవి తదితరులు పాల్గొన్నారు.