Sep 19,2023 17:03

ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని గంగనపల్లి పంచాయతీలోని తుంపెర గ్రామాన్ని మంగళవారం ఎమ్మార్పీఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నార్పల మండల రెవిన్యూ అధికారులారా అభివృద్ధి శాఖ అధికారులరా మా తుంపెర గ్రామాన్ని ఒక్కసారి సందర్శించండి.. మేం పడుతున్నటువంటి ఇబ్బందులు కనపడతాయి అంటూ గ్రామస్తుల తరఫున అధికారులకు విన్నవించారు. వివరాలలో కెళితే గ్రామంలో ఎస్సీ కాలనీకి పోయే దారిలో దాదాపు మూడు అడుగులు లోతులో ఎస్సీ కాలనీ  నివాసులంతా కూడా ఈ దారి నుండే పోవాలి. విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలన్నా ఇదే అక్కడ మురుగు నీళ్లు నిల్వ ఉండడంతో దుర్వాసన తో పాటు దోమలు కూడా అధికంగా ఉంటాయని విద్యార్థులు పాఠశాలకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఆ నీళ్లలోనే రావాలి. ఈ నీరు మురికి నీరు కావడంతో డెంగ్యూ మలేరియా  టైఫాడు లాంటివి విష జ్వరాలు ఎస్సీ కాలనీ వాసులకు అధికమవుతు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని  ఇంతవరకు గ్రామ అభివృద్ధి శాఖ కార్యదర్శి కనబడటం లేదు  అని మండల అధికారులారా తుంపెర గ్రామాన్ని ఇప్పటికైనా ఒకసారి సందర్శించండి అని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. గ్రామంలో ప్రజా ప్రతినిధులు ఉన్న కూడా  లేనట్టు ఉందని, కనీసం ప్రభుత్వం  కార్యక్రమంలో భాగంగా గడపగడప కార్యక్రమమైన తుంపెర గ్రామంలో నిర్వహిస్తే స్థానిక ఎమ్మెల్యే  అన్నా వస్తే  గ్రామస్తులు వారి గోడు వినిపించుకుంటారని అన్నారు. ఇంతవరకు తుంపెర గ్రామానికి ఎమ్మెల్యే ఒక్కసారి కూడా రాలేదని  ఎస్సీ కాలనీ కి ఆనుకొని స్మశాన వాటిక  సర్వే నంబరు 130 గూగూడు పొలముగల ఎకరా 25 సెంట్లు భూమికి కాను కేవలం ప్రస్తుతం 50 సెంట్లు స్థలం మాత్రమే మిగిలి ఉంది. చుట్టుపక్కల ఉన్నవారు స్మశానాన్ని కబ్జా చేసుకోవడంతో ఉన్నటువంటి స్థలంలో కూడా కంప చెట్లుచెట్టు పిచ్చి మొక్కలు వేపుగా పెరిగి ఉన్నాయి ఎవరైనా మనిషి చనిపోతే దహన సంస్కారాలు చేసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్మశానానికి వెళ్లే దారి కూడా సరిగా లేదని ఇప్పటికైనా అధికారులు తుంపెర గ్రామాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరించకపోతే ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామస్తులను కలుపుకొని నార్పల తాసిల్దార్ కార్యాలయం ఎదుట త్వరలోనే ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ నాయకులు సింగనమల నియోజకవర్గం ఇంచార్జ్ రంగాపురం పుల్లప్ప, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గడ్డం నాగయ్యపల్లి హనుమంతు, ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న ఆంజనేయులు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గడ్డం నాగయ్యపల్లి పెద్ద గంగయ్య, ఎమ్మార్పీఎస్ నార్పల మండలం అధ్యక్షులు ఎస్ వి రమణ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు మేకల రాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు తుంపెర రామకృష్ణ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పేల్లల నారాయణ, ఎమ్మార్పీఎస్ నాయకులు కేశేపల్లి ఆదినారాయణ, ఏరి నాగప్ప, బయన్న తదితరులు పాల్గొన్నారు..