Jul 30,2023 15:37

ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల కేంద్రానికి చెందిన పార రాఘవేంద్రను ఏపీ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు సువర్ణ రాజ్ ప్రకటించారు. ఈ సందర్భంగా పారా రాఘవేంద్ర మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి ఈ పదవిని అప్పజెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, మాదిగ జాతికి జిల్లాలో ఏ మూలనైనా అన్యాయం జరిగిన తక్షణమే స్పందించి వారికి న్యాయం చేస్తానని అన్నారు. భవిష్యత్తులో చేపట్టు పోయే వివిధ ఉద్యమ కార్యక్రమాలు విజయవంతంగా చేస్తానని అన్నారు.