Aug 13,2022 07:30

న్యూఢిల్లీ : తృణమూల్‌ కాంగ్రెస్‌కు రాజ్యసభ మాజీ సభ్యులు పవన్‌ కుమార్‌ వర్మ శుక్రవారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆయన వెల్లడించారు. మాజీ దౌత్యవేత్త, ప్రముఖ రచయిత పవన్‌ వర్మ ఏడాది క్రితమే టిఎంసిలో చేరారు. పార్టీ ఉపాధ్యక్షులుగానూ నియమితులయ్యారు.