Apr 07,2023 14:48
  • శాసనమండలి సభ్యులు డాక్టర్  మొండితోక అరుణ్ కుమార్

ప్రజాశక్తి-కృష్ణా : మండలంలో జుజ్జూరు గ్రామంలో ముస్లిం పవిత్ర ఈద్గార్ గ్రౌండ్ నిర్మాణ పనులను శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితో కరుణ్ కుమార్ శుక్రవారం గ్రామానికి చెందిన ముస్లిం మత సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మసీదులు మరియు ఈద్గా గ్రౌండ్ నిర్మాణానికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేసి ముస్లిం సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముస్లిం సంక్షేమ కోసం మసీదుల నిర్మాణం ఈద్గా గ్రౌండ్ అభివృద్ధి  మరియు స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మాణాల కోసం నిధులు కేటాయించి ముస్లిం సమాజం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. షాదీ ముబారక్ విదేశీ విద్య ఉర్దూ అకాడమీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాయకులు కోటేరు ముత్తారెడ్డి, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు, గ్రామ సర్పంచి రామావతి కోటి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు కోటేరు రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, పూల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.