Apr 01,2023 15:11

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జి బి ఆర్ ఫౌండేషన్, ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో  ప్రముఖ వైద్యులు గోపాలం శివన్నారాయణ  ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మెడికల్ క్యాంపు కన్వీనర్ పి నాగయ్య తెలిపారు. శనివారం స్థానిక జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య వేదిక, జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పెనుబోతు వెంకటేశ్వరరావు స్మారక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహణ కొనసాగింపు కార్యక్రమంలో భాగంగా 2వ తేదీ (ఆదివారం) స్థానిక జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ వైద్యులు గోపాలం శివన్నారాయణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఫిట్స్( మూర్ఛ) పక్షవాతం, వ్యాధులకు పరీక్షించి, రూ రెండు వందలకే రెండు నెలలకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మచిలీపట్నం ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు కుప్ప రామశాస్త్రి, పి సురేష్ చంద్రారెడ్డి,  డి ఆర్ కే ప్రసాద్, టి పద్మావతి రావి శ్రీనివాసరావు, ఆర్ శంఖరా నంద్ లు పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో మెడికల్ క్యాంపు నిర్వహణ కమిటీ సభ్యులు మాదాల.వెంకటేశ్వరావు,తదితరులు ఉన్నారు.