ప్రజాశక్తి-మంగళగిరి : తల్లి కుమారులతో సహా అదృశ్యం అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి గ్రామానికి చెందిన గొరికేపూడి రోజా తన ఇద్దరు కుమారులతో దసరా సెలవులకు మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో నివాసం ఉంటున్న తల్లి అయినా ద్రాక్షావలి ఇంటికి వచ్చారు. పండగ సెలవులు పూర్తి కావడంతో ఈ నెల 24వ తేదీన ద్రాక్షావల్లి ఆమె తల్లితో ఉంటున్నటువంటి మందపాటి శ్రీను, గొరికపూడి రోజాను, కుమారులు శామ్యూల్(4), ప్రేమ్ కుమార్(2.5) లను మంగళగిరి బస్టాండ్ లో తెనాలి బస్సు ఎక్కించారు. అయితే రోజా తన పిల్లలతో స్వగ్రామం చేరకపోవడంతో మూడు రోజులు పాటు బంధువులు ఇళ్ల దగ్గర వెతకటం జరిగింది. ఎక్కడ ఆచూకీ లేకపోవడంతో రోజా తమ్ముడు ఆళ్ళమూడి హానొక్ బాబు శనివారం మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పట్టణ పోలీసులు తెలిపారు.










