ప్రజాశక్తి-కృష్ణాజిల్లా (పామర్రు) : మైనర్ బాలికను(15) ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు మాయగాడు. పెళ్లి చేసుకోవడానికి వంచకుడు నిరాకరించారు. ప్రైవేట్ హాస్పిటల్ లో మైనర్ బాలిక ప్రసవించింది. పామర్రు మండలం కొమరవోలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయమై మైనర్ బాలిక దాసరి నాగ గోవిందుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.










