ప్రజాశక్తి-కలక్టరేట్(కృష్ణా) : అకాల వర్షాలకి నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని తెదేపా నేతలు బృందం సోమవారం కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజబాబును కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ మంత్రి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో సకాలంలో డ్రైన్ లు పూడికలు ప్రభుత్వం తీయకపోవడం వలన ఇటీవల కురిసిన అకాల వర్షానికి మచిలీపట్నం మండలం పరిధిలోని సుమారు 25వేల ఎకరాల మరియు 28 వేల ఎకరాలు వేరుశనగ పొలాలు నీట మునిగిపోయి. అలాగే పెడన నియోజకవర్గంలో సుమారు 56 వేల ఎకరాలు వరి పంట పామర్రు నియోజవర్గంలో 20వేల ఎకరాలు గుడివాడ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలు నీట మునిగిపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. రైతులు విత్తనాలు చల్లుకొని మొలక వచ్చే టైం లో పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారన్నారు. రైతులు ఎక్కువగా వరి సాగు వేరుశనగపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారని వారి జీవన ఆధారం పోయిందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొనకల్ల బుల్లయ్య, పామర్రు ఇంఛార్జి కుమార్ రాజా ,రాష్ట్ర కార్యదర్శి బచ్చుల బోసు, కృష్ణాజిల్లా రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ,మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు,నగర అధ్యక్షులు ఇలియాస్ షాషా,పిప్పల్ల కాంతారావు,బత్తిన దాసు, అక్కుమహంతి రాజా,గోకుల్ శివ మరియు రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










