ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : అక్టోబర్ 26 నుండి సామాజిక సాధికారత బస్సు యాత్ర ప్రారంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స స్యనారాయణ అన్నారు. ఆదివారం ఉదయం బీచ్ రోడ్ లోని వెల్కం హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ గత సంవత్సరం కాలం నుండి గడప గడపకు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ , ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలును తెలుసుకున్నాం. ఇప్పడు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సామాజిక సాధికారత బస్సు యాత్ర పేరుతో అక్టోబర్ 26 నుండి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సు యాత్ర ను నిర్వహిస్తున్నాం. ఈ యాత్ర రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రతి రోజూ ఒక నియోజకవర్గం లో ఈ యాత్ర ఉంటుంది. ఉదయం పూట వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధి నీ నియోజవర్గం లో ప్రజలకు వివరించి మధ్యాహ్నం తర్వాత నియోజకవర్గం లో ప్రధాన ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. ఈ యాత్ర అక్టోబర్ 26 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చపురం నుండి ప్రారంభం అయి అక్టోబర్ 27 గజపతినగరం. అక్టోబర్ 28 భీమిలి, అక్టోబర్ 30 పాడేరు,నవంబర్ 1 పార్వతీపురం, నవంబర్ 2 మాడుగుల, నవంబర్ 3 పలాస, నవంబర్ 4 ఎస్.కోట, నవంబర్ 6 గాజువాక, నవంబర్ 7 ఆమదాలవలస, నవంబర్ 8 సాలూరు, నవంబర్ 9 అనకాపల్లి లో మొదటి విడత ముగుస్తుంది. ఈ బస్సు యాత్రలో భాగంగా గడిచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివుద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో పాటు రాష్ట్రంలో ప్రతి పక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో అనకాపల్లి ఎంపి సత్యవతి, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పంచాయితీ రాజ్ మంత్రి బుడి ముత్యాల నాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన్ని కృష్ణదాస్, వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ కారణం ధర్మ శ్రీ, వైఎస్సార్సీపీ నాయకులు గొల్ల బాబురావు , పెట్ల ఉమాశంకర్, కోలా గురువులు, ఆడారీ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










