మీరు కల్తీ పాలు అని ఎలా గుర్తించాలని తెలుసుకోవాలనుకుంటున్నారా...? పెద్దగా ఖర్చు లేకుండా మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో కల్తీ పాల గుట్టు రట్టు చేయచ్చు. అదేలాగో చూడండి. పాలల్లో కల్తీని తెలుసుకోవాలంటే ల్యాబుల్లో టెస్టులు చేయాల్సిందే. కాని స్మార్ట్ ఫోన్ తో పాల కల్తీని గుర్తించే టెక్నాలజీని కనిపెట్టారు హైదరాబాద్ యువకులు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ పరిశోధనల బఅందం పాలలో కల్తీని గుర్తించగలిగే స్మార్ట్ ఫోన్ ఆధారిత సెన్సార్లను రూపొందించింది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ శివ గోవింద్ సింగ్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్లు సౌమ్య జానా., శివ రామ కఅష్ణ వంజర బఅందం పరిశోధనను ఇటీవల ఫుడ్ అనలిటికల్ మెథడ్స్ జర్నల్ విడుదల చేసింది. ఈ బఅందం మొదట పరిశోధన వ్యవస్థను అభివఅద్ధి చేసింది. ఇది పాలలో ఆమ్లతను కొలవడానికి సూచికగా కాగితాన్ని వినియోగించారు. కాగితంలో రంగు మార్పును ఖచ్చితంగా గుర్తించగల ప్రోటోటైప్ స్మార్ట్ ఫోన్ - అనుకూల అల్గోరిథంను అభివఅద్ధి చేశారు. ఫోన్ కెమెరాను ఉపయోగించి పాలలో ముంచిన తర్వాత సెన్సార్ స్ట్రిప్స్ లోని రంగు మార్పును పరిశీలిస్తుంది. అంతే కాదు ఈ డేటా జూన స్థాయిని తెలియజేస్తుంది.
'క్రోమాటోగ్రఫీ మరియు స్పెక్ట్రోస్కోపీ వంటి టెక్నిక్లను కల్తీని గుర్తించడానికి వినియోగిస్తారు. ఇటువంటి టెక్నిక్‌లకు సాధారణంగా ఖరీదైన సెటప్ అవసరం ఉంటుంది. పాలలో కల్తీని గుర్తించడానికి వినియోగదారుడు ఉపయోగించే సాధారణ పరికరాలను మనం అభివఅద్ధి చేయాలన్న ఆలోచనతో ఈ పరిశోదన పుట్టుకొచ్చింది. ఈ పారామీటర్లన్నింటినీ ఒకేసారి పర్యవేక్షించడం ద్వారా పాల కల్తీ అరికట్టవచ్చు'అని ప్రొఫెసర్ శివ గోవింద్ సింగ్ చెప్పారు.










