Aug 15,2023 23:49

ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. వివరాలు ఇవి..
అమలాపురం: దేశ స్వాతం త్య్రం కోసం పోరాడిన స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాలను స్మరించు కోవడానికి ప్రతి ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందనని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రివ జోగి రమేష్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిఎంసి బాలయోగి స్టేడియం నందు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా తొలుత గా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా గౌరవ వందనాన్ని స్వీకరించారు. తదుపరి పేరెంట్‌ కమాండర్‌ విజయ భాస్కర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు బలగాలు, ఎన్‌సిసి అభ్యర్థుల పేరేడ్‌ కవాతు గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. తదుపరి నిర్వహించిన 11 ప్రభుత్వ శాఖలు శకటాల ప్రదర్శనలో గృహ నిర్మాణ సంస్థ శకటం ప్రథమ స్థానం లోనూ, డిఆర్‌డిఎ ద్వితీయ స్థానంలో నూ, ఉద్యాన శాఖ తతీయ స్థానం లోనూ నిలిచాయి. విధి నిర్వహణలో ఉద్యోగులు అందించిన విశిష్ట సేవలకు ప్రశంసా పత్రాలు బహూకరించారు.క ార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్‌పి ఎస్‌.శ్రీధర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, ఎంఎల్‌సిలు ఐవి, బొమ్మి ఇశ్రాయెల్‌, ఎంఎల్‌ఎలు కొండేటి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమలాపురం విద్యుత్‌ నగర్‌ లో పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ చేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండపేట: మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్థానిక వైసిపి, టిడిపి, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు, ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు, చైర్పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణిలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలంలోని మేడపాడు, ఇప్పనపాడు, ఏడిద సీతానగరం, ఏడిద, అర్తమూరు గ్రామ పంచాయతీలలో పట్టణంలోని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీ శారదా మున్సిపల్‌ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. కపిలేశ్వరపురం: మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సొసైటీ, పంచాయతీ, కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ కె.సూర్యారావు, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి మేడిశెట్టి సత్యవేణి, ప్రభుత్వ పాఠశాల వద్ద జెడ్‌పిటిసి సభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ మూర్తి, ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సిడిపిఒ ఎ.గజలక్ష్మి, మండల మహిళా కార్యాలయం వద్ద ఎపిఎం దుర్గాప్రసాద్‌, అంగర పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ చంటి జాతీయ పతాకాలను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షులు రూబెన్‌ అన్నారు.కపిలేశ్వరపురం పాస్టర్స్‌ క్రిస్టియన్‌ కమ్యూనిటీ హాల్‌ వద్ద పాస్టర్స్‌ ఫెలో షిప్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రామచంద్రపురం: రామచంద్రపురం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి అంబటి భవాని ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్‌ ఎంపిడిఒ సలట్‌ రాజు, మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రామచంద్రపురం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆగష్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు పిల్లి మురళీమోహన్‌ వెంకటరమణ జాతీయ జెండాను ఎగురవేశారు. ముఖ్య అతిథులుగా సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.మాధవి దేవి, జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌. నాగేశ్వరరావు నాయక్‌ లు పాల్గొన్నారు. అనంతరం సీనియర్‌ న్యాయవాదులను సత్కరించారు. కె.గంగవరం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి పంపన నాగమణి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. శివల జిల్లా పరిషత్‌ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ అనసూరి సాయిబాబు, వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ ఇళ్ల సూర్యనారాయణ తదితరులు చేతుల మీదుగా వివిధ క్రీడలను ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు మెడల్స్‌ అందజేశారు. పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు రివార్డులు అందజేశారు. తోటపేట గ్రామపంచాయతీ గాంధీ నగర్‌ లో జాతీయ జెండాను జెడ్‌పిటిసి సభ్యుడు మెర్ని డి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయజెండా ఎగురవేశారు. ఐ.పోలవరం: ఐ పోలవరం మండలంలో స్వాతంత్య్ర దినోత్సవాన్నిఎ దుర్లంక-రామాలయం పేట సెంటర్‌ లో ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎం పి పి మోర్త రాణి మిరియం జ్యోతి, జెడ్‌పిటిసి సభ్యులు ముదునూరి సతీష్‌ రాజు, తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ ఝాన్సీ లక్ష్మి కుమారి,పోలీస్‌ స్టేషన్‌ లో ఎస్‌ ఐ సి హెచ్‌ రాజేష్‌ పతాకావిష్కరణ చేశారు. ఎంపిడిఒ డి.రాంబాబు ఆధ్వర్యంలో మండలంలో ఉన్న 50మంది ఉద్యోగులకు ఉత్తమసేవా పురస్కారం ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా అందజేశారు. జగనన్న ఆణిముత్యాలు పథకం ద్వారా పాతఇంజరం హైస్కూల్‌ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో మార్కులు సాధించిన ఇళ్ల అనుశ్రీ రూ.3వేలు, ఎన్‌.తనుశ్రీ రూ.2వేలు, ఆర్‌.సంతోష్‌ కుమార్‌ రూ.వెయ్యి నగదును అందజేశారు. ఐ.పోలవరం హైస్కూల్‌ అబివృద్ధిలో 1997-98 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు భాగస్వామ్యం కావటం 8,9 తరగతి లో ప్రథమ, ద్వితీయ,తృతీయ స్థానాలను మార్కులు సాధించిన విద్యార్థులకు మెమెంటో అందించటం ప్రశంసనీయమని జెడ్‌ పి టి సి సభ్యులు ముదునూరి సతీష్‌ రాజు పేర్కొన్నారు. దాతల సాయంతో రూ.50వేల విలువైన బహుమతులు పదవ తరగతిలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు అందజేశారు. ఉప్పలగుప్తం: మండలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమనపల్లి పిహెచ్‌సిలోను, ఎస్‌.యానాం అమత్‌ సరోవర్‌ వద్ద ఎంపిపి దంగేటి వీర అచ్యుత జానకి, గొల్లవిల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ జె. వెంకటేశ్వరి,ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిడిఒ కెఎస్‌ గౌరీ కుమారి లు జాతీయ జెండాలను ఎగురవేశారు. అంబాజీపేట: మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు, పోలీస్టేషన్‌ వద్ద ఎస్‌ఐ ఎ. చైతన్యకుమార్‌, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మంగాతయారు, పిహెచ్‌సి వద్ద వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, సొసైటీ కార్యాలయం వద్ద చైర్‌ పర్సన్‌ దొమ్మేటి సత్యమోహన్‌, అంబాజీపేట గంగలకుర్రు, పుల్లేటికుర్రు ముక్కామల, గంగలకుర్రు అగ్రహారం,తొండవరం జెడ్‌పి హైస్కూల్లో జెడ్‌పిఇసి సభ్యురాలు బూడిద వరలక్ష్మి , ఎంఇఒ కె.వెంకటేశ్వరరావు, హెచ్‌ఎంలు, ఎఎంసి వద్ద మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ల ఆధ్వర్యంలో మండల పరిధి 16 పంచాయతీల వద్ద సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, సొసైటీ చైర్మన్‌లు, జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాట్రేనికోన: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ,ప్రయివేటు కార్యాలయాలు,సచివాలయాలు, పాఠశాలలు, బ్యాంకుల వద్ద మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడింది.కాట్రేనికోన జెడ్‌పి ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు సందర్బంగా కీర్తి శేషులు మాజీ మంత్రివర్యులు సామాజిక విప్లవ యోధుడు, దళితనాయకుడు మోకా శ్రీవిష్ణుప్రసాద్‌ రావు జ్ఞాపకార్థం అయన సతీమణి మోకా చంద్రనాగరత్నం పదవ తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించిన వారికి రూ.5 వేలు సాయాన్ని అందజేశారు. మండల వైసిపి కన్వీనర్‌ నల్లా నరసింహమూర్తి, పాఠశాల హెడ్‌ మాస్టర్‌ యమ్‌.వెంకటేశ్వరరావు, సర్పంచ్‌ గంటి వెంకట సుధాకర్‌, వైస్‌ ఎంపిపి సానబోయిన నాగేశ్వరావు, సొసైటీ అధ్యక్షులు జగడం బాలయోగి తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం: తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ డివిఎన్‌ అనిల్‌ కుమార్‌, మండల ప్రజా పరిషత్‌ వద్ద ఎంపిపి కుండా అన్నపూర్ణ, జెడ్‌పిటిసి సభ్యుడు బోనం సాయిబాబా, ఎంపిడిఒ నాతి బుజ్జి, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ బి వై.కిరణ్‌ కుమార్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాజోలు: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం రాజోలు మండలంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు,విద్యా సంస్థల్లో ఘనంగా నిర్వహించారు. రాజోలు న్యాయ స్థానాల సముదాయంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ప్రమీలా రాణి,బార్‌ అసోసియేషన్‌ భవనంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోట సుధాకర్‌,రాజోలు తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ బి. ముక్తేశ్వర రావు,పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో సి.ఐ గోవింద రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రావులపాలెం: రావులపాలెం మండలం గోపాలపురం సచివాలయం-1, రావులపాలెం వై.యస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద, రావులపాలెం బి.ఎస్‌.ఎన్‌. ఎల్‌. ఆఫీస్‌ ఎదురుగా గల మసీదు నందు, జిల్లా ప్రజాపరిషత్‌ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలల నందు ఎంఎల్‌ఎ చిరల్ల జగ్గిరెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రావులపాలెం జిల్లా ప్రజాపరిషత్‌ బాలికొన్నత పాఠశాలలో 2022-2023 విద్యాసంవత్సరంలో 10 వ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించి జగనన్న ఆణిముత్యాలు సర్టిఫికెట్లు, నగదు బహుమతి అందచేశారు. కొత్తపేట: వాడపాలెం జెడ్‌పి హైస్కూల్‌ నందు టెన్త్‌లో అత్యధిక మార్పు సాధించిన నారపల్లి లోహిత, పిల్లా సత్యధనలక్ష్మి , సిద్దు సుబ్రహ్మణ్యం, కె..స్వప్న, బండారు సంజన దేవీలకు పలువురు అందజేసిన స్కాలర్షిప్‌ రూ.75వేలను రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బండారు సత్యానందరరావు, గ్రామ సర్పంచ్‌ త్సామా ఆదినారాయణ మూర్తి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. మామిడికుదురు దీప్తి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మామిడికుదురు, నగరం సాయి దీప్తి విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులు దేశ నాయకులు, సైనికులు, పోలీసుల, వేశాధారణలు ఆకట్టుకున్నాయి. ఆక్సిజన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దీప్తి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.