ప్రజాశక్తి-టంగుటూరు : ఇళ్ల మధ్యలో నున్న మురునీటి గుంట నుంచి వచ్చే దుర్గంధంతో అల్లాడిపోతున్నట్లు తూర్పు పోతుల చెంచయ్య నగర్ సమీపంలోని పిచ్చిగుంట్ల కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైసిపి కొండపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబు కాలనీ వద్దకు శనివారం వచ్చారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు అశోబాబు ఎదుట తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉందన్నారు. అధికారుల వద్ద అనేకమార్లు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదన్నారు. సమస్యను మీరైనా పరిష్కరించాలని అశోక్ బాబుకు విన్నవించారు. గుంటలో మురుగునీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతున్నట్లు తెలిపారు. దీంతో ప్రజలు వ్యాధుల బారీన పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా స్పందించి మురుగు నీటి గుంతను పూడ్పించాలని వేడు కున్నారు. దీంతో స్పందించిన అశోక్‌బాబు మాట్లాడుతూ మురుగునీటి గుంట సమస్యన ుకలెక్టర్ దష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అధికారులతో చర్చించి సమస్యను శాశ్వతంగా పరిష్కార మయ్యేలా తగు చర్యలు తీసుకుంటా మనిహామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంబిసి కార్పొరేషన్ డైరెక్టర్ పుట్టా వెంకటరావు, కాలనీవాసులు పాల్గొన్నారు.










