Sep 22,2023 21:37

మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి - సాలూరు : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు, పట్టణ నాయకులు టి.రాముడు, టి.శంకరరావు ఆధ్వర్యాన కార్మికులు ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ మృతి చెందిన కార్మికులు బి.గంగరాజు, బి.శంకరరావు, టి.నాగరాజు, బాబూరావు స్థానంలో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన పట్టణ జనాభా దృష్ట్యా కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు సబ్బులు, నూనెలు, చెప్ఫులు పంపిణీ చేయాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులు మరణిస్తే జీవో ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. అర్హులైన కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.అనంతరం కమిషనర్‌ జయరాంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మహిళా కార్యదర్శి టి.ఇందూ పాల్గొన్నారు.