Oct 17,2023 20:00

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి మండల కన్వీనర్‌ మల్లికార్జున

ప్రజాశక్తి- దేవనకొండ
ఈనెల 19న ఎమ్మిగనూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సభను జయప్రదం చేయాలని వైసిపి మండల కన్వీనర్‌ కప్పట్రాళ్ల మల్లికార్జున, జడ్‌పిటిసి రామకృష్ణ కోరారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు నాలుగోసారి 'జగనన్న చేదోడు' విడుదల చేస్తున్నారని, జగనన్న మాట ఇస్తే మాట తప్పరని అనడానికి ఇది ఒక నిదర్శనమని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బీసీల కులగణనపై చర్యలు తీసుకోవడం హర్షణీయమని చెప్పారు. వైసిపి మండల సీనియర్‌ నాయకులు ప్రభాకర్‌ రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యులు జుబేర్‌ సాబ్‌, వైసిపి నాయకులు శంకరయ్య, హరిశ్చంద్ర, మద్దిలేటి, శీను, భీమన్న పాల్గొన్నారు.