ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో భాగంగా అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. బుధవారం నార్పల లో కార్యక్రమం ముగించుకుని సాయంత్రం 4:45 గంటలకు విమానాశ్రయానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అక్కడి నాయకులను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు విమానంలో గన్నవరానికి బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఉభయ జిల్లాల కలెక్టర్లు అరుణ్ బాబు, గౌతమి, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, తిప్పే స్వామి, పివి సిద్ధారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర విద్యా సలహాదారు ఆలూరి సాంబశివరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెసి టిఎస్ చేతన్, డిఐజి అమ్మిరెడ్డి, ఎస్ పి మాధవరెడ్డి, అనంతపురం ఎస్ పి శ్రీనివాసరావు, డిఆర్‌ఒలు ఘనంగా వీడ్కోలు పలికారు. సీఎం వెంట మంత్రులు బొత్స, నాగార్జున వెళ్లారు. ఈసందర్భంగా సత్యసాయి జిల్లా కలెక్టరు అరుణ్ బాబు నంది విగ్రహాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు.










