May 27,2023 16:18

eevaram nandayala

ముగిసిన యువగళం..
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి

     టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏప్రిల్ 13న డోన్ అసెంబ్లీ నియోజకవర్గంతో ప్రారంభమై మంగళవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంతో ముగిసింది. మొత్తం 40రోజుల పాటు జిల్లాలో పాదయాత్ర సాగింది. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 45 మండలాలు, 281 గ్రామాల మీదుగా 507 కిలో మీటర్లు పొడవున యువగళం పాదయాత్ర కొనసాగింది. జిల్లాలో 40 రోజుల పాదయాత్రలో లోకేష్కు వివిధవర్గాలు, ప్రజలనుంచి రాతపూర్వకంగా 868 వినతిపత్రాలు అందాయి. కర్నూలులో మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొన్న లోకేష్ 25 ముఖాముఖి సమావేశాలు నిర్వహించి ఆయా వర్గాల సమస్యలు తెలసుకున్నారు. దారిడిపొడవునా లోకేషు మహిళలు, యువకులు, వృద్దులు కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకున్నారు.
భానుడి ప్రతాపం...
మార్చి చివరి వారం నుంచి భానుడు భగభగలాడుతూ ఎండ వేడిమిని పెంచుతున్నాడు. జిల్లాలో వేసవి తీవ్రత అధికమై నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గత వారం రోజుల నుంచి ఎండ తీవ్రరూపం దాల్చింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరింత వేడి పెరగడంతో అత్యధికంగా ఆళ్లగడ్డలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాణ్యం, నంద్యాలలో 44, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరులో 43, డోన్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే నెలాఖరు వరకు ఎలాంటి ఎండలు ఉంటాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అవినాష్ అనుచరుల అరాచకం...
     తన తల్లి చిక్సిత నిమిత్తం కర్నూలులో అవినాష్ రెడ్డి ఉండగా అవినాష్ అనుచరులు కర్నూలులో అరాచకం సృష్టించారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న వార్తలు నేపథ్యంలో విశ్వభారతి ఆశీర్వది వద్దకు చేరుకున్న అవినాష్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఆసుపత్రి వద్ద కవరేజ్ కోసం ఉన్న మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఆర్ టి వి ప్రతినిధి తో పాటు ఇద్దరు కెమెరామెన్లు, ఆంధ్రజ్యోతి ఈ టీవీ విలేకరులపై, సూర్య ఫోటోగ్రాఫర్ అంజిపై అవినాష్ రెడ్డి అనుచరులు గాడికి పాల్పడ్డారు. తీవ్ర దుర్భాషలాడుతూ కొట్టారు. ఆసుపత్రి వద్ద మీడియా వ్యక్తులు ఎవరు ఫోటోలు వీడియోలు తీయకుండా అవినాష్ రెడ్డి అనుచరులతో పాటు వైసిపి నాయకులు పహారా కాశారు. ఫోటోలు తీసిన కొందరు మీడియా వ్యక్తులపై బెదిరింపులకు పాల్పడి ఫోటోలను డిలీట్ చేయించారు.