ప్రజాశక్తి-అనంతపురం ఏ-1 చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో అనంతపురంలోని కెఎస్‌ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-15 ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్‌పిప్-2023 పోటీలు ఆదివారంతో ముగిశాయి.ఈ సందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజర్ శ్రవణ్‌కుమార్, ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ఛైర్మన్ బాలరాజు మాట్లాడుతూ స్విస్ లీగ్ పద్ధతిలో 8 రౌండ్ల పోటీలు నిర్వహించగా 8/8 పాయింట్లతో చాంపియన్‌ఫిప్ టైటిల్‌ను ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడకు చెందిన ఫిడే మాస్టర్ ఎం.డి. ఇమ్రాన్ (క్లాసికల్ రేటింగ్ 2197) సాధించినట్లు తెలిపారు. అలాగే రన్నరప్‌గా అనంతపురం జిల్లాకు చెందిన శామ్యూల్ స్టీఫెన్, 3వ స్థానం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మజ్జి రామ్‌చరణ్‌తేజ, 4వ స్థానం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీతసాగర్ కోనపర్తి, 5వ స్థానం కాకినాడ జిల్లాకు చెందిన యశస్వి సత్య గంగాధర్, 6వ స్థానం బాపట్ల జిల్లాకు చెందిన తల్లా నిశ్చల్, 7వ స్థానం అనంతపురం జిల్లాకు చెందిన యం.పి. సహృద్, సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శంకరయ్య, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు బిసాటి భరత్, జీవన్‌కుమార్, డాక్టర్ సుప్రజాచౌదరి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీరంగయ్య, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసప్రసాద్, ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఉదరుకుమార్ నాయుడు, టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ ఫణికుమార్, శ్రీసత్యసాయి జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి నాగార్జున కర్ణాటకమ్, తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులతో అతిథులు










