మాట్లాడుతున్న మేనేజింగ్ డైరెక్టర్ వెంకటసుమంత్
ప్రజాశక్తి-టంగుటూరు
ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని యూవీ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ బి వెంకట సుమంత్ పేర్కొన్నారు. గురువారం స్థానిక పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపుల్ ఈ ద్వితీయ సంవత్సర విద్యార్థుల పీసీబి డిజైన్ వర్క్ షాప్ ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పిసిబి డిజైన్‌కు ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ జీవీకే మూర్తి, ట్రిపుల్ ఈ విభాగాధిపతి బి నాగరాజు, కళాశాల కోఆర్డినేటర్లు కె సౌజన్‌కుమార్, ఎం మల్లికార్జున్, కళాశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










