మూఢనమ్మకాలపై అవగాహన
ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో 'మూఢ నమ్మకాలు- నష్టాలు' అనే అంశంపై అవగా హన అక్కరాం పల్లిలోని శ్రీ పద్మావతి మహిళా భ్యుదయ సంఘం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గోవిందధామం ప్రసిడెంట్ టెంకాయల దామోదరం మాట్లాడుతూ బల్లి శాస్త్రం, శకునాలు, రాహుకాలలు, గ్రహణాలు, చేతబడులు జ్యోతిష్యాల గురించి వాటిల్లో మూఢనమ్మకాలు ఏవో చక్కగా వివరించారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కేవీపీ రాజకుమార్ మాట్లాడుతూ మూఢనమ్మకాలు నేటి కాలంలో ముఖ్యంగా స్త్రీలపై ఎక్కువ ప్రభావితం చూపుతా యన్నారు. ఇంత అభివద్ధి చెందిన కాలంలో కూడా చాలామంది మూఢనమ్మకాలను పాటించడం బాధగా ఉందన్నారు. ముఖ్యంగా స్త్రీలు మూఢ నమ్మకాల్ని ఎక్కువగా నమ్ముతు న్నారని, మూఢ నమ్మకాలపై వారికి ఎంతో అవగాహన అవసరం అన్నారు. ఎస్వియూ మహిళా అధ్యయనం కేంద్రం డైరెక్టర్ ఆచార్య కే. సుధారాణి మాట్లాడుతూ మూఢనమ్మకాల విషయంలో ముఖ్యంగా స్త్రీలు చాలా అప్రమత్తంగా ఉండాలని లేకపోతే చాలా ప్రమాదాలు గురికావాల్సి వస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యయన కేంద్రం అధ్యక్షురాలు డాక్టర్ కే. శ్రీలత కిషోరి, విద్యార్థులు, శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం మహిళా సభ్యులు పాల్గొన్నారు.










