May 24,2023 22:38

చేనేత కార్మికులకు అవగాహన కల్పిస్తున్న చేనేత జౌళిశాఖ ఏడీరమేశ్‌

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : పట్టణంలోని సాయినగర్‌ సచివాలయంలో బుధవారం చేనేత కార్మికులకు ముద్రపథకంపై అవగాహన కార్యక్రమాన్ని చేనేత జౌళిశాఖ జిల్లా ఎడి రమేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చేనేత కార్మికులకు ముద్రపథకం, నేతన్ననేస్తం. తదితర ప్రభుత్వపథకాల గురించి అవగాహన కల్పించారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ అభివృద్ధి అధికారి రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.