ప్రజాశక్తి కదిరి టౌన్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో మతవిద్వేషాలను నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై రేపుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ విమర్శించారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన శాఖ కార్యదర్శుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతాలు కులాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీ కరణ చేయడానికి పూనుకుందన్నారు. ఇదే జరిగితే వేలాది మంది కార్మికులు రోడ్ల మీద పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పంటల బీమాలో రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదన్నారు. అమ్మ ఒడి బటన్ నొక్కినప్పటికీ ఇప్పటికీ చాలామందికి అందలేదన్నారు.కార్మికులు కర్షకుల తరఫున సిపిఎం పోరాటాలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, పట్టణ కార్యదర్శి జిఎల్ నరసింహులు, సిఐటియు నాయకులు జగన్మోహన్, సాంబశివ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబ్జాన్, రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి, శివన్న, పెద్దన్న, శ్రీరాములు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.










