ఆర్థిక సాయం చేస్తున్న సంఘం నాయకులు
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
పట్టణంలోని శివన్న నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు జేరుబండి ఆంజనేయులు సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. పట్టణానికి చెందిన పద్మశాలి సంఘం నాయకులు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులు విశ్వనాథ్, రమేష్, ప్రధాన కార్యదర్శి పోలే వీరప్రసాద్, కోశాధికారి దోమ భీమేష్, కార్యదర్శి మానా సత్యనారాయణ, గోరంట్ల, పాండు పాల్గొన్నారు.










