Jul 21,2023 18:51

ఆర్థిక సాయం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
అనారోగ్యంతో మృతి చెందిన సంగటి ఈరన్న కుటుంబానికి ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం మండలంలోని రచ్చమర్రి గ్రామానికి చెందిన సంగటి ఈరన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మృతుని కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.10 వేల నగదును అందజేయాలని గ్రామ నాయకులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు స్థానిక వైసిపి నాయకులు వెంకోబా, రోగప్ప, బొజ్జప్ప, రవి రెడ్డి, లక్ష్మయ్య, వీరన్నగౌడ్‌, రాము, మేకల నారాయణ, రాము, కర్రెన్న, రాజు, మోహన్‌, సోమేష్‌లు ఈరన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు నగదు అందజేశారు.