ప్రజాశక్తి - ఆదోని
రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆదోనిలోని 40వ వార్డు శుక్రవారం పేటలో రెండో రోజు కౌన్సిలర్ హిందు ఆధ్వర్యంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ ఎమ్మెల్యే ముందుకు సాగారు. మురుగుకాలువలు, డ్రెయినేజీలు, కల్వర్టులు, తాగునీటి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమస్యలను వింటూ సత్వరమే పరిష్కార దిశగా ఎమ్మెల్యే చొరవ చూపారు. అనంతరం ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం 'నవరత్నాల'ను ప్రవేశపెట్టారన్నారు. నవరత్నాల పథకాలనే టిడిపి కాపీ కొట్టి పేర్లు మార్చి మేనిఫెస్టోను విడుదల చేసిందని తెలిపారు. 2024 ఎన్నికల్లోనూ వైసిపిని ప్రజలు ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ ఛైర్మన్ శాంత, వైసిపి పట్టణ అధ్యక్షులు బి.దేవా, మున్సిపల్ వైస్ ఛైర్మన్లు నరసింహులు, మహ్మద్ గౌస్, మున్సిపల్ ఇంజినీర్ నాగభూషణం రెడ్డి, మాజీ కౌన్సిలర్లు చంద్రకాంత్ రెడ్డి, సంజీవ్, మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ కామాక్షి తిమ్మప్ప, స్టేట్ డైరెక్టర్లు రేణుక, మంజుల, వార్డు ఇన్‌ఛార్జీ దుర్గప్ప, నాయకులు తాయన్న, రహీం, రామలింగేశ్వర్, చంద్ర, బీరప్ప, మమ్మత్తు స్వామి, జులేఖ, శ్రీదేవి, అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మి, బ్రహ్మి, రఘు, అయ్యప్ప, ఆబు, చిన్న ఈరప్ప, శీన, లాల్ బాషా, ట్రాన్స్‌కో నాయక్, వార్డు అడ్మిన్ రాము ఉన్నారు.
సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే










