Apr 27,2023 23:05

మోడల్‌ ఎంసెట్‌ పరీక్ష రాస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి - హిందూపురం : ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రెండవ రోజు గురువారం పట్టణంలోని సువర్ణ భారతి జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన మోడల్‌ ఎంసెట్‌ విజయవంతం అయింది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, కళాశాల ఎఒ అనీల్‌, అధ్యాపకులు మోడల్‌ ఎంసెట్‌ ప్రశ్న పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా అనీల్‌ మాట్లాడుతు ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల సమస్యలపై పోరాటాలను చేయడంతో పాటు పరీక్షల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్రశేఖర్‌, హర్ష, మహేష్‌, భగత్‌, వినోద్‌, నిహాల్‌, అబి,ó రమేష్‌, హర్ష, నాగేంద్ర, నవీన్‌, లిఖిత్‌, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.