Apr 25,2023 22:09

ప్రశ్న పత్రాలను విడుదల చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, ప్రిన్సిపల్‌, అధ్యాపకులు

ప్రజాశక్తి-హిందూపురం : భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని సప్తగిరి కళాశాలలో నిర్వహించిన మోడల్‌ ఎంసెట్‌ విజయవంతం అయింది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, కళాశాల ఎంబిఎ ప్రిన్సిపల్‌ నారాయణ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ శివ శంకర్‌ రెడ్డి, ఎఒ గంగిరెడ్డి మోడల్‌ ఎంసెట్‌ ప్రశ్న పత్రాలను విడుదల చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల సమస్యలపై పోరాటాలను చేయడంతో పాటు పరీక్షల్లో ఉన్నా భయాన్ని పోగొట్టడానికి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులకు ఎంసెట్‌పై అవగాహన వస్తుందన్నారు. బాబావలి మాట్లాడుతు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సప్తగిరి కళాశాలలో నిర్వహించిన పరీక్షలకు 500 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్రశేఖర్‌, హర్ష, మహేష్‌, భగత్‌, వినోద్‌, నిహాల్‌, అభిó, రమేష్‌,్‌ హర్ష, నాగేంద్ర, నవీన్‌, లిఖిత్‌, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.