మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు ొఉయ్యూరులో ఆట..పాట..మాట
ప్రజాశక్తి-ఉయ్యూరు : మోడీ పాలనలో దేశ రాజ్యాంగం మీదనే పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా హక్కులను పరిరక్షించు కోవాలని మాజీ మంత్రి, అఖిలభారత నాయకులు వడ్డే శోభనాద్రిశ్వరరావు అన్నారు. మోడీ హటావో దేశ్ కో బచావో అనే నినాదంతో ఉయ్యూరు లోని నాగళ్ళ రాజేశ్వరమ్మ జానకి రామయ్య విజ్ఞాన కేంద్రం ఆవరణలో సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటా..పాట మాట కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ సంపద సష్టికర్తలైన శ్రమ జీవులపై పాలకులు బహుముఖ దాడి చేస్తూ, అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ కుబేరులకు ప్రజల ఉమ్మడి ఆస్తులను కట్టబెడుతున్నారని తెలిపారు. రాజ్యాంగ ఆదేశాలకు అనుగుణంగా ఆర్థిక అసమానతలను తగ్గించకపోగా, మరింతగా పెంచారని ప్రజల అసంతప్తిని పక్కదారి పట్టించడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మతోన్మాద శక్తులను పెంచి పోషిస్తున్నదన్నారు. స్వాతంత్య్ర, రాజ్యాంగ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ప్రజలందరూ ఐక్యం కావాలని మతోన్మాద బిజెపిని రాబోయే ఎలక్షన్లలో గద్దె దింపాలని ఆయన పిలుపు నిచ్చారు. జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షులు కే శివ నాగేంద్రం అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాలతో పాటు రాష్ట్ర కార్యదర్శులు ఎం హరిబాబు, ఎస్ అనిల్ కుమార్, జిల్లా మహిళా సంఘం కార్యదర్శి వీరమాచనేని జ్యోతి, ప్రశాంతి, సిఐటియు మండల కార్యదర్శి సబ్జా బాలగంగాధర్, నాట్యమండలి బాధ్యులు కే కొండబాబు, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. ఆటపాట లో భాగంగా జానపద కూచిపూడి రంగస్థలం కళారూపాలను ప్రదర్శించారు.










