ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలోని బంటనహాల్ గ్రామంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మొహర్రం ఉత్సవాలను సామరస్యంగా జరుపుకోవాలని ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ, ఎస్‌ఐ రమేష్ బాబు, వైసిపి కన్వీనర్ ఏరూరు రంగస్వామి తెలిపారు. గురువారం ఆలూరు సిఐ వెంకటేశులు, ఎస్‌ఐ రమేష్ బాబు ఆదేశాల మేరకు మార్కెట్ యార్డు ఛైర్మన్ నారాయణ ఆధ్వర్యంలో బంటనహాల్ గ్రామ పెద్దలు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. అధికారుల సలహాలు, సూచనల మేరకు నడుచుకుంటామని సంతకాలు పెట్టి మొహర్రం పండగను సామరస్యంగా నిర్వహించుకుంటామని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ... గ్రామ పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఈ షరతులు పెడుతున్నట్లు తెలిపారు. నారాయణ మాట్లాడుతూ... మంత్రి జయరామ్ సహకారంతో అధికారుల సలహా మేరకు ప్రశాంత వాతావరణంలో మోహర్రం పండగను నిర్వహించుకోవాలని తెలిపారు. అనవసరంగా ఘర్షణలు తలెత్తకుండా, మంత్రి జయరామ్‌కు చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని కోరారు. సర్పంచి తనయుడు సురేష్, వైసిపి నాయకులు పరమేష్, రాఘవేంద్ర, రమేష్ పాల్గొన్నారు.
బంటనహాల్ ప్రజలకు సూచనలు ఇస్తున్న ఎస్‌ఐ రమేష్ బాబు










