May 09,2023 21:47

విరాళం చెక్కు అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : పట్టణంలోని సుందరయ్య నగర్‌ కు చెందిన మాజీ కౌన్సిలర్‌ షాకే చిన్నికృష్ణ కుమారుడు సాకే మహేందర్‌ ఇటీవల డీఎస్పీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సాకే మహేందర్‌ డీఎస్పీగా శిక్షణ తరగతులో ఉన్నారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన మొదటి వేతనం 50 వేల రూపాయలను ఆర్డీటీకి అందజేశారు. ఈ మేరకు మంగళవారం ఆర్టీఈ రిసోర్స్‌ మొబైల్స్‌ మూర్తికి, రిసోర్స్‌ మొబలైజేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగపూర్‌కు తన తండ్రి చేతుల మీదుగా చెక్కును అందజేశారు.