ప్రజాశక్తి-ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో మంగళవారం భారీ వర్షం కురవడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక పోవడంతో వర్షం పడిన ప్రతిసారి కాలువల నుంచి ఒక్కసారిగా నీరు రోడ్లపైకి ప్రవహిస్తుంది. ముఖ్యంగా నాలుగు రోడ్ల కూడలి నుంచి సుజనకోట వెళ్లే రహదారిలో డ్రైనేజి మరింత దయనీయంగా మారింది. మందుబాబులు సేవించిన మద్యం సీసాలు, వివిధ ప్లాస్టిక్ బాస్టిల్స్, బురద వంటి చెత్త చెదరమంతా డ్రైనేజిలో పేరుకుపోయింది. దీంతో అటుగా రాకపోకలు సాగించిన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
పెదబయలు:మండల కేంద్రంలో మంగళవారం భారీ వర్షం కురింది. పంట పోలాల్లో నిండుగా నీరు చేరింది. మెయిన్ రోడ్డుపై డ్రైనేజి లేక ఇళ్లల్లోకి బురదనీరు చేరింది.విద్యుత్ అంత రాయం ఏర్పడింది. బయోమెట్రిక్ హాజరుకు అవస్థలు పడ్డారు.










