మనస్వినిని అభినందిస్తున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
గుమ్మలక్ష్మీపురం: స్థానిక కస్తూరిబా పాఠశాలలో చదువుతున్న సామల మనస్విని ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేందుకు ఎంపికవ్వడం పట్ల కురుపాం ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి అభినందించారు. ఈ మేరకు ఆదివారం విద్యార్థినిని ప్రిన్సిపల్ శ్రీరంజని చినమేరంగి క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఐక్యరాజ్యసమితికి ఎంపికైన మనస్విని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే, జిల్లా వైసిపి అధ్యక్షులు శత్రుచర్ల పరిషత్ రాజు అన్నారు. అనంతరం విద్యార్థిని సత్కరించి రూ.50,000 అందించారు.










