ప్రజాశక్తి - కురుపాం : ఇటీవల ఐక్యరాజ్యసమితి పర్యటనకు వెళ్లి వచ్చిన గుమ్మలక్ష్మీపురం కెజిబివి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కురుపాం మండలం కొండబారిడి గ్రామానికి చెందిన విద్యార్థి సామల మనస్వికి ఆదివారం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్విన్‌పేట ఎస్‌ఐ షణ్ముఖరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామంలో పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఎవరికి రానటువంటి అవకాశం మనస్వినికి రావడం గర్వించదగ్గ విషమని, ఐక్యరాజ్యసమితిలో రాష్ట్రానికి సంబంధించిన విద్య, సంక్షేమ పథకాలను వివరిస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసి ఇంకా బాగా చదువుకుని ఐఎఎస్, ఐపిఎస్ సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావా లన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం గిరిజన బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ యుగంధర్, గ్రామ సర్పంచ్ లక్కాయి, గ్రామస్తులు పాల్గొన్నారు.










