Aug 01,2023 23:06

ప్రజాశక్తి-ఉంగుటూరు (గన్నవరం): మణిపూర్‌ గిరిజనులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఉంగుటూరు గ్రామంలో పిఎస్‌ వద్ద ఆశా వర్కర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్‌ యూనియన్‌ మండల కార్యదర్శి జి కోటేశ్వరమ్మ, ఉదయలక్ష్మి, సభ్యులు లక్ష్మి రాధా, రంగమ్మ, కమల, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అజ్మీర వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజాశక్తి-గుడ్లవల్లేరు: మణిపూర్‌ నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని, అల్లర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని కోరుతూ గుడ్లవల్లేరు, కౌతవరం పిహెచ్‌సిల వద్ద నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షురాలు సీహెచ్‌.చందన, ఆశ యూనియన్‌ కార్యదర్శి ఐ.ఇందిర, సిఐటియు మండల నాయకులు బి.వి.శ్రీనివాసరావు, గుడ్లవల్లేరు పిహెచ్‌సి నాయకులు టి.తులసి, కే జ్యోతి, లక్ష్మి, నీలిమ, కౌతరం పీహెచ్సీ నాయకులు బి వరలక్ష్మి, ఎస్‌ స్వర్ణలత, ఎన్‌ దేవి, దుర్గ పాల్గొన్నారు. ప్రజాశక్తి-తోట్లవల్లూరు: మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో మంగళవారం క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షులు వల్లూరు చంద్రశేఖర్‌, నిస్సి టెలివిజన్‌ డైరెక్టర్‌ శేఖర్‌ ఇందుపల్లి, వైస్‌ ప్రెసిడెంట్‌ సాల్మన్‌, కార్యదర్శి ఈడుపుగంటి సాల్మన్‌ రాజ్‌, మెండురి కిషోర్‌ బాబు, మట్ట జీవన్‌ పాల్గొన్నారు. ప్రజాశక్తి-ఉయ్యూరు: నాగళ్ల రాజేశ్వరమ్మ జానకిరామయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. మతోన్మాద బిజెపి ప్రభుత్వం మణిపూర్‌లో విఫలమైందని కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ రాజేష్‌ విమర్శించారు. ఈ సమావేశంలో నిస్సి ఛానల్‌ డైరెక్టర్‌ ఇందుపల్లి శేఖర్‌, ఉయ్యూరు మండల పాస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వేమూరి జాన్‌ క్రాస్‌, బీఎస్పీ నాయకులు ప్రసాద్‌ దళిత ఐక్యవేదిక నాయకులు పెనమాల నాగ కుమార్‌, సమత సైనిక్‌ అధ్యక్షులు టి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.