Jul 26,2023 22:16

చిలమత్తూరులో కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న అంగన్వాడీలు, తదితరులు

లేపాక్షి : మణిపూర్‌ ఘటనకు నిరసనగా మండలం పరిధిలో ని పులమితి పంచాయతీ లోని సడ్లపల్లి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ సిబ్బంది జయమ్మ,సునీత తదితరులు పాల్గొన్నారు.
చిలమత్తూరు : మణిపూర్‌ మారణహోమాన్ని నిరసిస్తూ చిలమత్తూరు మండల కేంద్రంలో ఐసిడిఎస్‌ సీడీపీవో రెడ్డి రమణమ్మ ఆధ్వర్వంలో అంగన్‌ వాడి కార్యకర్తలు బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌ నుండి బస్టాండ్‌ వరుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మణిపూర్‌ ఘటనకు పాల్పడిన దుండగులను ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమం లో అంగన్‌ వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
హిందూపురం : మణిపూర్‌ ఘటనను నిరసిస్తూ ఎఐటియుసి ఆద్వర్యంలో మహిళలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారుతి రెడ్డి, ఫక్రుద్దీన్‌, నారాయణరెడ్డి, అలీమ్‌, అక్కమ్మ, విజయలక్ష్మి, అలివేలమ్మ, రాధిక, తదితరులు పాల్గొన్నారు.